జ‌క్క‌న్న‌తో ఆటాడుకున్న‌ ఎన్టీఆర్..వీడియో వైర‌ల్‌!

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టిస్తుండ‌గా.. ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్, అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. జ‌క్క‌న్న‌తో ఆటాడుకున్నాడు ఎన్టీఆర్‌. మ్యాట‌ర్ ఏంటంటే.. నిత్యం షూటింగ్‌లో బిబీగా ఉండే ఎన్టీఆర్‌, రాజమౌళి కొంత ఖాళీ సమయంలో దొరకడంతో తాజాగా వాలీబాల్‌ ఆడారు. అటు పక్క టీమ్‌లో రాజమౌళి, ఇటు పక్క టీమ్‌లో ఎన్టీఆర్ ఉండి.. పోటా పోటీగా ఆట ఆడారు.

ఇక ఈ అరుదైన దృశ్యాల‌ను ఓ వ్యక్తి వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంతో హుషారుగా వాలీబాల్ ఆడుతుండ‌డంతో.. ఆయ‌న అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

Share post:

Popular