ర‌చ్చ లేపుతున్న ప‌వ‌న్-రానా మూవీ మేకింగ్ వీడియో!

July 27, 2021 at 6:21 pm

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఈ చిత్రం నిన్నే మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది.

ఈ సినిమాలో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్‌ ఆర్మీ ఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా మేకింగ్ గ్లింప్స్‌ను చిత్రం యూనిట్‌ విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి కూడా షూట్‌లో జాయిన్ అయినట్లుగా చూపించారు.

అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సజెషన్స్ ఇస్తున్నట్లుగా వీడియోలో క‌నిపిస్తోంది. ఇక చివ‌ర్లో భీమ్లా నాయక్‌ రిపోర్టింగ్‌ సంక్రాంతి అని చెప్పి రిలీజ్‌ డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారు మేక‌ర్స్‌. మొత్తానికి ర‌చ్చ లేపుతున్న ఈ మేకింగ్ వీడియో.. ఇటు ప‌వ‌న్‌, అటు రానా అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

 

ర‌చ్చ లేపుతున్న ప‌వ‌న్-రానా మూవీ మేకింగ్ వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts