ఎన్టీఆర్ టీవీ షో టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్‌..?!

July 22, 2021 at 11:03 am

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లె ఈ షో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

ఇక ప్ర‌స్తుతం ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని నంద‌మూరి ఫ్యాన్స్‌ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్రకారం..ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫ‌స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్‌కు డేట్ టాక్ చేశార‌ట‌. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ షో ఫ‌స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంద‌ట‌.

అంతేకాదు, ఈ ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రానున్నార‌ని.. ఆయ‌న‌తోనే ఎన్టీఆర్ గేమ్ ఆడించ‌నున్నార‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఈ షో వేదిక‌గా ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ప్రమోషన్స్ కూడా చేయనున్నార‌ట‌.

ఎన్టీఆర్ టీవీ షో టెలికాస్ట్ కి డేట్ ఫిక్స్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts