సైకో కిల్లర్‌గా సుహాస్‌..థ్రిల్లింగ్‌గా `ఫ్యామిలీ డ్రామా` ట్రైలర్!

July 22, 2021 at 11:32 am

కలర్ ఫొటో సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న న‌టుడు సుహాస్‌.. తాజా చిత్రం ఫ్యామిలీ డ్రామా. ఈ మూవీ ద్వ‌రా మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఛాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

suhas: I can assure that Sunil Garu has a terrifying role in Colour Photo: Suhas | Telugu Movie News - Times of India

ఇటీవ‌ల ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తో ఆకుట్టుకున్న చిత్ర యూనిట్‌.. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇన్నాళ్లూ సాధారణ రోల్స్ చేసిన సుహాస్‌.. ఈ మూవీలో మనుషుల గొంతు కోస్తూ ఆనందం పొందే సైకో కిల్ల‌ర్ రోల్ పోషించాడ‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్న ఓ ఫ్యామిలీకి సహాయం చేయడానికి వచ్చిన సైకో కిల్లర్ సుహాష్.. వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్న‌ట్టు టైల‌ర్‌లో చూపించారు.

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగిన ఫ్యామిలీ డ్రామా ట్రైల‌ర్ కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మ‌రింత హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ఆధ్యంతం ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. మ‌రి సుహాస్ సైకో కిల్ల‌ర్‌గా మార‌డానికి కార‌ణం ఏంటీ? అస‌లు ఈ సైకో కిల్లర్ కథ ఏంటి? తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

సైకో కిల్లర్‌గా సుహాస్‌..థ్రిల్లింగ్‌గా `ఫ్యామిలీ డ్రామా` ట్రైలర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts