అల్ల‌రి న‌రేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడ‌ట‌?!

July 22, 2021 at 11:54 am

నాంది సినిమాతో ప్రేక్ష‌కుల మ‌నసు దోచుకున్న అల్ల‌రి న‌రేష్‌.. తాజా చిత్రం స‌భ‌కు న‌మ‌స్కారం. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు.

Allari Naresh movies, filmography, biography and songs - Cinestaan.com

ఇటీవ‌లె విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ న‌వీన్ చంద్ర కూడా న‌టిస్తున్నాడ‌ట‌.

Naveen Chandra (Actor) Height, Weight, Age, Girlfriend, Biography & More »  StarsUnfolded

సభకు నమస్కారంలో న‌వీన్ చంద్ర నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషించ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రం అల్ల‌రోడి కెరీర్‌లో 58వ మూవీగా తెర‌కెక్కుతోంది. అలాగే ఇందులో నరేష్ క్యారెక్టర్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

అల్ల‌రి న‌రేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడ‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts