హాస్ప‌ట‌ల్‌లో న‌య‌న్ తండ్రి..పెళ్లికి ఒప్పుకున్న బ్యూటీ?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురై కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త్వ‌ర‌గా ప్రియుడు, కోలీవుడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకోవాల‌ని న‌య‌న్‌ను కోరుతున్నార‌ట‌. కానీ, ఆమె చేతి నిండా సినిమాలు ఉండ‌డంతో పెళ్లిని ఆల‌స్యం చేస్తూ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు తండ్రి ఆరోగ్యం మ‌రింత విష‌మిస్తూ ఉండ‌డంతో.. వెంట‌నే విఘ్నేష్‌ను పెళ్లి చేసుకునేందుకు న‌య‌న్ ఒప్పుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తండ్రి హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ కాగానే.. ముహూర్తాలు పెట్టుకోనున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Share post:

Popular