త‌గ్గేదే లే అంటున్న మెహ్రీన్‌..అక్క‌డ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుందిగా!

కృష్ణ గాడి వీర ప్రేమా గాధ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్ కౌర్‌.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ భామ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్ 3, మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి చిత్రాల్లో న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. నెంజిల్ తునివిరుందాయ్ మూవీ తో త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు, డి ఎస్ పి దేవ్ మూవీ తో పంజాబీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ త్వ‌ర‌లోనే క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోనూ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. శివరాజ్‌కుమార్‌ హీరోగా రామ్‌ ధూలిపూడి దర్శకత్వంలో ఓ కన్నడ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో హీరోయిన్‌గా మెహ్రీన్‌ను ఎంపిక్ చేశారు.

ఇక ఈ చిత్రం ద్వారా శాండల్ వుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోన్న మెహ్రీన్‌.. మొత్తానికి త‌గ్గేదే లే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. కాగా, ఇటీవ‌ల కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌‌తో మెహ్రీన్ బ్రేకప్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరుగుతుందని అంతా అనుకుంటున్న తరుణంలో అందరికీ షాకిస్తూ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పింది మెహ్రీన్.

Share post:

Latest