కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి.
ప్రస్తుతం ఏపీలో మూడు వేలకు లోపుగా రోజూవారి కేసులు నమోదు అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,843 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 301 కరోనా కేసులు నమోదు కాగా.. అతి స్వల్పంగా కర్నూలు జిల్లాలో 24 కేసులు వచ్చాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 19,48,592 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 13,209 దగ్గర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 2,199 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,11,812 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 23,571 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్నొక్క రోజే 86,280 కరోనా పరీక్షలు నిర్వహించారు.