పవన్ సినిమా కోసం న్యూ సినిమాటోగ్రాఫర్…?

July 22, 2021 at 6:02 pm

వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓ మాస్ ఫిల్మ్ సైన్ చేశాడు. “అయ్యప్పణం కోషియం” అనే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీంతో జూలై నెల 14న మొదలు కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకు బ్రేక్ పడడంతో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ళ పలు కారణాల చేత సినిమా నుంచి తప్పుకున్నారు.

ప్రస్తుతం ఆయన ప్లేస్ లో తమిళ్ మరియు అనేక బాలీవుడ్ చిత్రాలకు తన వర్క్ అందించిన రవి కె చంద్రన్ వర్క్ చేయనున్నట్టుగా తాజా సమాచారం. ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సిన ఈ మూవీ ఇంకా మొదలు కాలేదు. దీంతో పవన్ నెక్స్ట్ సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఇది నిజంగా పవన్ ఫ్యాన్ కి బాడ్ న్యూస్ అనే చెప్పాలి.

పవన్ సినిమా కోసం న్యూ సినిమాటోగ్రాఫర్…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts