తమిళ స్టార్ తో వనిత మరో వివాహం…?

July 22, 2021 at 5:52 pm

పెళ్లిళ్లు, విడాకులు, విమర్శలతో వనిత విజయ్‌కుమార్‌ ఎపుడు వార్తల్లో నిలుస్తుంది. సీనియర్‌ నటుడు విజయ్‌, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత తెలుగు, తమిళ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలతో కన్నా ఆమె వివాదాస్పద నటిగానే పేరు తెచుకుంది. ముగ్గురిని పెళ్లి చేసుకొని.. వారితో విడాకులు తీసుకున్న ప్రతిసారి ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె నాలుగో పెళ్ళికి సిద్దమయ్యింది అనే న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

వనిత త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ ఆ వ్యక్తి పేరు ‘S’ అక్షరంతో మొదలవుతుంది అని ఓ జ్యోతిష్యుడు చెప్పిన వీడియో ఒకటి తెగ వైరల్‌ అయింది. అంతేకాక ఆమె రాజకీయాల్లో కూడా దివంగత ముఖ్యమంత్రి జయలలితలా సత్తా చాటుతుందని జ్యోతిష్యుడు పేర్కొన్నాడు. ఇంతలోనే పవర్‌ స్టార్‌ శ్రీనివాసన్‌తో వనిత పూలదండలు మార్చుకుంటున్న ఫోటో సోషల్‌ మీడియాలో కనిపించింది. ఇంకేముంది నెట్టింట ఫోటో తెగ చక్కర్లు కొట్టింది. కానీ అది నిజం పెళ్ళికాదని ప్రస్తుతం తను చేస్తున్న ఓ సినిమాలోని ఓ స్టిల్‌ అని తెల్సింది. ఏది ఏమైనా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత నాలుగో పెళ్లికి రెడీ అయిన ఆశ్చర్యం లేదు.

తమిళ స్టార్ తో వనిత మరో వివాహం…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts