ప్రియమణి పెళ్లి చెల్లదట.. ఎందుకంటే..?

July 22, 2021 at 5:26 pm

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌, ‘నారప్ప’ చిత్రాలతో హిట్ కొట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఫామిలీ లైఫ్ అంత సాఫీగా లేదు. ఈ సమస్య ఆమె భర్త వాళ్ళ కాదు. ఆమె భర్త మొదటి భార్య వల్ల. విషయం ఏంటి అంటే. ప్రియమణికి 2017లో ముస్తఫా రాజ్‌ తో వివాహం జరిగింది. కానీ ప్రియమణి కంటే ముందే ముస్తఫా రాజ్‌ ఆయేషాను పెళ్లి చేసుకున్నాడు.

వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతుల మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఇద్దరూ 2010 నుంచే విడివిడిగా బతుకుతున్నారు. తరువాత ముస్తఫా ప్రియమణిని పెళ్లి చేసుకున్నా..మొదటి భార్యకు పిల్లల పెంపకం కోసం ప్రతి నెలా ఎంతో కొంత డబ్బు పంపిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన మొదటి భార్య ఒక మీడియా ముందుకు వచ్చి వాపోయింది. తన భర్త పిల్లల పెంపకానికి సరిపోయే డబ్బులు ఇవ్వడం లేదని చెప్తుంది. అసలు ముస్తపా తన మాజీ భర్త కాదని ఇప్పటికే తన భర్తే అని.. తాము విడాకులు తీసుకోలేదని చెప్తుంది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదు అంటూ ఆరోపించింది. మరి దీనిపై ప్రియమణి ఎలా స్పందిస్తో చూడాలి.

ప్రియమణి పెళ్లి చెల్లదట.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts