బేబ‌మ్మ‌ జోరు..మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్‌?!

ఉప్పెన సినిమాతో బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకుని.. మొద‌టి సినిమాతోనే ఘ‌న విజ‌యం సాధించిన కృతి శెట్టి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్‌బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మ‌రియు రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Naga Chaitanya shares his list of lockdown recommendations | Telugu Movie  News - Times of India

అయితే వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. బేబ‌మ్మ మ‌రో రెండు ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిద‌ని తెలుస్తోంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే బంగార్రాజు సినిమాలో నాగ‌చైత‌న్య న‌టించ‌బోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ చిత్రంలో చైతు సరసన కృతి శెట్టి న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Official Announcement of Nithin Next Movie – TFPC

అలాగే మ‌రోవైపు టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. ప్రముఖ ఎడిటల్ ఎస్ఆర్ శేఖర్‏ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేయబోతున్నాడ‌ట‌. ఈ చిత్రంలో నితిన్‏కు జోడిగా కృతి నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌లే నిజ‌మైతే.. టాలీవుడ్‌లో కృతి జోరు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.