వామ్మో..`కేజీఎఫ్-2` ఆడియో హ‌క్కులను అన్ని కోట్ల‌కు కొన్నారా?

కోలీవుడ్ రాకింగ్ స్టార్ య‌ష్, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. బాక్సాఫీస్‌ దద్దరిలిపోయేలా చేయడంతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. తాజాగా కేజీఎఫ్-2 మూవీ దక్షిణాది భాషల ఆడియో హక్కులు ఏకంగా రూ.7.2 కోట్లకు అమ్ముడయ్యాయి. లహరి మ్యూజిక్, టీ సిరీస్ కలిసి ఈ హక్కులను కొనుగోలు చేశాయి.

ఆడియో హ‌క్కుల‌కే ఏడు కోట్లంటే అదీ ఓ రికార్డే అని చెప్పాలి. కాగా, ఈ చిత్రం జూలైలో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా అడ్డుప‌డింది. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Share post:

Latest