ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్‌` వ‌స్తోంద‌ట‌?!

July 21, 2021 at 10:45 am

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ డేట్‌కు రాధేశ్యామ్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన సెప్టెంబ‌ర్ 30ను రాధే శ్యామ్ విడుద‌ల తేదీగా ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

సెప్టెంబ‌ర్ 30న ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కిన ఛ‌త్ర‌ప‌తి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అదే రోజున‌ రాధేశ్యామ్‌ను థియేట‌ర్‌లోకి దింపాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్‌` వ‌స్తోంద‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts