మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ఆ రోజు డ‌బుల్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఆగస్టు 9 మహేష్ బ‌ర్త్‌డే అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రోజున మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తార‌ని అంద‌రూ భావించారు.

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్ బ‌ర్త్‌డేకి డ‌బుల్ ట్రీట్ రాబోతోంద‌ట‌. సర్కారు వారి పాట ఫస్ట్ గ్లిమ్స్ వీడియో మరియు ఓ పోస్టర్ విడుదల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. మ‌రి ఇదే నిజ‌మైతే.. మ‌హేష్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు.

Share post:

Latest