`ఉప్పెన‌`లో మొద‌ట ఏ హీరోను అనుకున్నారో తెలిసా?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉప్పెన‌. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి కీ రోల్ పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

డెబ్యూ మూవీతోనే ఇటు వైష్ణ‌వ్‌, అటు బుచ్చిబాబు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రానికి ఫ‌స్ట్ చాయిస్ వైష్ణ‌వ్ కాద‌ట‌. ఈ విష‌యాన్ని బుచ్చిబాబే స్వ‌యంగా వెల్ల‌డించాడు.

I'm still clueless about stardom: Vijay Deverakonda

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని బేస్ చేసుకొని క‌థ రాసుకున్న‌ట్టు తెలియ‌జేశాడు. అయితే అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ రేంజ్ మార‌డంతో.. త‌న మన‌సు మార్చుకొని వైష్ణ‌వ్‌ని సంప్ర‌దించాన‌ని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. మొత్తానికి అలా విజ‌య్ చేయాల్సిన సినిమా వైష్ణ‌వ్ చేసి.. టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

Share post:

Latest