త‌ల్లి కాబోతున్న కాజ‌ల్‌..క్లారిటీ వ‌చ్చేసింది!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కలువ కళ్ల సుందరి.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది.

- Advertisement -

ఇక‌ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను కాజ‌ల్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో మాల్వీవ్స్‌కు చెక్కేసిన కాజ‌ల్‌..అక్క‌డ మ‌స్తు ఎంజాయ్ చేసింది. ఇదిలా ఉంటే.. కాజ‌ల్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాజల్‌ గర్భవతి అన్నది ఆ వార్త సారాంశం.

ఈ మ‌ధ్య కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్‌.. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు. త్వరలో పిల్లలను కంటే.. తన కొడుకుకు తోడుగా ఆడుకుంటాడని ఆటపట్టించింది. ఇక అప్ప‌టి నుంచి కాజ‌ల్ త‌ల్లి కాబోతోందంటూ ప్ర‌చారం ఊపందుకుంది. అయితే ఈ విష‌యంపై కాజ‌ల్ స‌న్నిహితులు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదు. ఆమె గర్భవతి కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

Share post:

Popular