గర్భిణీల వాక్సినేషన్ కి కేంద్రం ఆమోదం…?

కరోనా మహమ్మారి మెడలు వంచడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదలు ఫ్రంట్ లైన్ వారియర్ల తర్వాత విడతల వారీగా అందరికీ వేస్తున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనదేశం అగ్రరాజ్యం అమెరికాను కూడా దాటేసింది. అంతలా మన దేశంలో ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.

కాగా.. దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీల వ్యాక్సిన్ గురించే ప్రతి ఒక్కరికీ సందేహాలుండేవి. కానీ ఆ సందేహాలను పటాపంచలు చేస్తూ… గర్భిణులు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ప్రతిపాదనలకు కేంద్రం ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది. ఇకపై నుంచి గర్భిణులు కోవిన్ పోర్టల్ లో లేదా దగ్గర్లోని టీకా కేంద్రానికి వెళ్లి… వ్యాక్సిన్ కోసం రిజిస్ర్టేషన్ చేసుకుంటే.. వ్యాక్సిన్ వేస్తారని తెలిపారు.