గ్రాండ్‌గా స్టార్ట్ అయిన `ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్..పిక్స్ వైర‌ల్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది.

Image

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌మౌళి దంప‌తులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Image

అలాగే రాజ‌మౌళి తండ్రి, స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ర‌మా రాజమౌళి స్విచాన్ చేయ‌గా.. జ‌క్క‌న్న క్లాప్ కొట్టారు. అలాగే ఫ‌స్ట్ షాట్ ఏఎం ర‌త్నం డైరెక్ట్ చేయ‌గా, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రిప్ట్ అందించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఇక త్వ‌ర‌లోనూ ఈ మూవీ రెగ్యుల‌ర్ షూట్ ముంబైలో జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం అందుకు ఏర్పాట్లు అన్నీ శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి.

Image

Image

Share post:

Latest