ఏపీ బీజేపీ కొత్త రాగం.. ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో..?

ఏపీలో ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీగా తెలుగుదేశం పార్టీగా గుర్తింపు ఉంది.  వారే.. కాదు మేము కూడా ఉన్నాం రాష్ట్రంలో.. ప్రభుత్వం చేసే తప్పులను మేము కూడా ఎత్తిచూపుతాం అంటున్నారు బీజేపీ నాయకులు. జనం తమను గుర్తించాలని వారు చేయని ప్రయత్నం లేదు.  అందుకే ఇపుడు ఆలయ పరిరక్షణ అనే కార్యక్రమం రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆలయాల చుట్టూ తిరిగి వాటిని పరిరక్షిస్తాడట. కమలం నేతలు, కార్యకర్తలు వెంటరాగా ఆలయాల వద్దకు వెళుతున్నాడు. ఇదంతా ఎన్నికల స్టంటే.. ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చేసే కార్యక్రమమే అని అందరికీ తెలుసు. ఆలయ పరిరక్షణ అంటే ఆలయాల వద్దకు వెళ్లి దర్శనం చేసుకోవడం కాదు.. వాటిని పునరుద్ధరించాలి.. ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి.. అదీ చేయాల్సింది. అపుడు అందరూ హర్షిస్తారు. అనేక ఆలయాలపై ఈ ప్రభుత్వ హయాంలో  దాడి జరిగింది అని కలమం నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే బీజేపీ చేస్తున్న ఈ వాదనను శ్రీనివాసరావు ఖండించారు. నిజంగా వారికి ప్రేమే ఉంటే.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు బీజేపీ నాయకుడు మాణిక్యాల రావు హయాంలో కూడా దాడులు జరిగాయి.. మీరేం చేశారని ప్రశ్నించారు. ఏదేమైనా ఆలయాలపై దాడులు జరగడం బాధాకరం.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. రాజకీయం మాత్రం చేయరాదు.

Share post:

Latest