ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌?!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయ‌న బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

SS Rajamouli launches Bellamkonda Sreenivas's Chatrapathi Hindi remake -  Movies News

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన `ఆది` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ల్లంకొండ శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్‌నే ఈచిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం సినిమా హక్కులు కూడా ఆయ‌న ద‌గ్గ‌రే ఉన్నాయి.

Aadi'

అందుకే ఇపుడు ఆది సినిమాను కూడా హిందీలో వినాయక్ దర్శకత్వంలోనే రీమేక్ చేయాలనే బెల్లంకొండ శ్రీ‌నివాస్ భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇదే నిజ‌మైతే.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై సైతం అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Share post:

Latest