ఆగిపోయిన అనుష్క సినిమా..కార‌ణం అదేన‌ట‌?!

July 15, 2021 at 8:19 am

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. మునుప‌టి జోరు ఇప్పుడు చూపించ‌డం లేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన భామ‌.. ఆ త‌ర్వాత మ‌రే సినిమాను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, రారా కృష్ణయ్యా ఫేం పి. మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ సినిమా చేయ‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నారు.

యూవీ క్రియేషన్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టించ‌నున్నాడ‌ని, మ‌రియు ఈ మూవీకి మిస్టర్ శెట్టి మిస్సెస్ పొలిశెట్టి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. ఈ సినిమా ఆగిపోయిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్నా.. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రావ‌డం లేదు.

ఇక ఇప్పుడు సినిమా సెట్స్ పైకి రాకముందే సడన్ గా క్యాన్సిల్ అయినట్లు టాక్ వస్తోంది. అయితే స్క్రిప్ట్ సరిగ్గా సెట్టవ్వకపోవడం వల్ల అనుష్క‌నే నో చెప్పింద‌ని.. అందుక‌నే సినిమా ఆగిపోయింద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

 

ఆగిపోయిన అనుష్క సినిమా..కార‌ణం అదేన‌ట‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts