“అలా అమెరికాపురంలో” ప్రోమోను విడుదల చేయనున్న బన్నీ..?

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓటీటీ యాప్ అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంటుంద‌ని తెలుసు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు అయిన థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ ను ఆహా, హంసిని ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్వహించనున్నాయంట‌. ఇక థమన్ లైవ్ ఇన్ యూఎస్ఎ ప్రోగ్రామ్‌కు అలా అమెరికాపురంలో అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం పై అభిమానులు చాలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నార‌ని తెలిసిందే.

అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో ను ఈరోజు సాయంత్రం 7 గంటలకు రిలీజ్ చేస్తారు. ప్ర‌స్తుతం ఆహా ప్ర‌తి శుక్రవారం 15 సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆహా ఓటీటీ త్వ‌ర‌లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తోపాటు లవ్ స్టోరీ, లక్ష్య మూవీల‌ను కూడా అందించేందుకు రెడీ అవుతున్నట్లు తాజాగా పేర్కొంది. కాగా అభిమానులు ఈ సినిమాల కోసం, కొత్త కార్యక్రమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest