న‌మ్మిన వాడే మోసం చేశాడు..ఐశ్వర్య రాజేష్ ఆవేద‌న‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈమె తెలుగమ్మాయే. కానీ, త‌మిళంలో వర్సటైల్ క్యారెకర్స్ చేస్తూ అక్క‌డ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు, హీరోయిన్ ప్రాధాన్య‌త ఉన్న చిత్రాలు చేస్తూ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్య‌క్తి చేతుల్లోనే ఐశ్వ‌ర్య‌ మోస‌పోయింద‌ట‌.

ఈ విష‌యాన్ని ఇటీవ‌ల‌ ఆమెనే స్వ‌యంగా వెల్ల‌డించింది. అభిమానుల నుంచి డబ్బులు తీసుకుని, నా వ్యక్తిగత వివరాలను లీక్ చేయ‌డం వంటి పనులను నా వెంట ఉన్న ఒక వ్యక్తే చేస్తున్నారనే విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఐశ్వ‌ర్య‌..ఇకపై జాగ్రత్తగా వుండాలని గ్రహించాన‌ని చెప్పుకొచ్చింది.

అదే సమయంలో నన్ను మోసం చేసిన వ్యక్తికి ఒక్క విషయం సూటిగా చెబుతున్నాను. ఇలాంటి నమ్మకద్రోహం మరో వ్యక్తికి చేయొద్దు. ఇలాంటి విషయాల వల్ల ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో నాకు అర్థంకావడం లేదు అంటూ ఐశ్వ‌ర్య పేర్కొంది. మ‌రి ఐశ్వ‌ర్య‌ను మోసం చేసిన ఆ వ్య‌క్తి ఎవ‌రో తెలియాల్సి ఉంది. కాగా, ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో ఈ బ్యూటీ దిట్టమ్‌ ఇరండు, భూమిక, డ్రైవర్‌ జమున, ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌ రీమేక్‌, మోహన్‌ దాస్‌, ధృవనక్షత్రం చిత్రాల్లో న‌టిస్తోంది.

Share post:

Latest