ప‌వ‌న్ సినిమాలో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కీల‌క పాత్ర‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ఒక‌టి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్ట్రింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వి.వి. వినాయక్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది.

It's been a very long wait for Vinayak

ఒరిజినల్ లో క్యామియో రోల్ లో దర్శకుడు సాచి కనిపించాడు. అయితే తెలుగులో వివి వినాయ‌క్ ఆ రోల్‌ను పోషించ‌బోతున్నాడ‌ట‌. ఈ రోల్‌కు సంబంధించిన‌ షూటింగ్ కూడా పూర్తయిందని వినికిడి. కాగా, గతంలో ఠాగూర్, నేనింతే, ఖైదీ నెం. 150 చిత్రాల్లో వినాయ‌క్ మెరిసిన‌ సంగతి తెలిసిందే.

Share post:

Latest