ఏసీ కార్ల‌లో తిరుగుతున్నారా..అయితే క‌రోనా ముప్పు ఎక్కువే!

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్ క‌రోనా మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్ర‌తి రోజు భారీగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా ప్ర‌జ‌లు బ‌య‌ట తిర‌గ‌డం మాన‌డం లేదు. ఏదో ఒక వంక‌తో బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నాయి. అయితే బ‌య‌ట తిర‌గ‌డం వ‌ల్ల కాకుండా.. ఏ వాహ‌నంలో తిరుగుతున్నామ‌న్న దానిపై కూడా క‌రోనా ముప్పు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తాజాగా జాన్ హాప్‌కిన్స్ విశ్వ‌విధ్యాల‌యం ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు.

వారి ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. ఆటోలో ప్ర‌యాణం చేసే వారిలో ఒక‌రి నుంచి క‌రోనా వైర‌స్ మ‌రోక‌రికి సోకే అవ‌కాశం తక్కువ‌గా ఉంటుంద‌ట‌. గాలి, వెలుతురు ఎక్కువ‌గా ఉంటే క‌రోనా సోకే ప్ర‌మాదం త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే ఆటోలో ప్ర‌యాణిస్తే క‌రోనా ముప్పు త‌గ్గుతుంద‌ట‌. అయితే ఆటోలో ప్ర‌యాణం చేసేవారికంటే న‌ల‌బై మంది ప్ర‌యాణించేందుకు వీలుగా ఉండే బ‌స్సుల్లో 72 రెట్లు అధికంగా, నాన్ ఏసీ కార్ల‌లో 86 రెట్లు, ఏసీ కార్ల‌లో 300 రెట్లు అధికంగా క‌రోనా సోకే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.