వంశీ పైడిపల్లి సినిమాకు విజ‌య్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌?!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే విజ‌య్ ఓ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా.. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించ‌నున్నాడు.

ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం విజ‌య్ కెరీర్‌లో 66వ చిత్రంగా తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు విజ‌య్ పుచ్చుకుంటోన్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికిగానూ విజ‌య్ ఏకంగా 100 కోట్లు పారితోషకంగా తీసుకుంటున్నాడ‌ట‌.

ఒక్క సినిమాకు 100 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ప్రభాస్ తప్ప అంత పారితోషికం ఎవరూ తీసుకోలేదు. అది కూడా పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చిన తర్వాతే ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్ 100 కోట్ల‌కు వెళ్లింది. కానీ, పాన్ ఇండియన్ ఇమేజ్ రాకుండానే విజ‌య్ రెమ్యున‌రేష‌న్ ఎవరెస్ట్ ఎక్కేయ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Popular