`బీస్ట్‌`గా వ‌స్తున్న విజయ్ ద‌ళ‌ప‌తి..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజయ్‌కు ఇది 65వ సినిమా. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సన్‌పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే నేడు విజ‌య్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 65వ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ మూవీ టైటిల్‌ను ‘బీస్ట్‌’గా ఖారారు చేశారు. బీస్ట్‌ అని ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఈ పోస్టర్‌లో విజయ్‌ చేతిలో తుపాకి పట్టుకుని స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు.

దీంతో ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, బీస్ట్ మొద‌టి షెడ్యూల్ జార్జియాలో పూర్త‌యింది. రెండో షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ప్రారంభించ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది.

 విడుదలైన క్షణం నుంచి వైరల్ అవుతుంది ఈ పోస్టర్. చేతిలో తుపాకి పట్టుకుని ఉన్న విజయ్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. దళపతి ఇమేజ్‌కు సరిపోయేలా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కథ సిద్ధం చేసాడు. ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు.<br />

Share post:

Latest