నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మాలినేనితో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే శ్రుతి హాసన్, త్రిష, టబు ఇలా పలువురి పేర్లు వినిపించినా.. ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమా కోసం మెహ్రీన్‌ను హీరోయిన్గా తీసుకున్నారట మేకర్స్.
ఇటీవలె ఆమె కథ చెప్పగా.. వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. అంతేకాదు, బాలయ్య సరసన నటించేందుకు మెహ్రీన్ భారీ రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయగా.. ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, మెహ్రీన్ ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రంతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ మూవీ, గోపీచంద్ సరసన ఓ మూవీ చేస్తోంది.