తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్‌.ర‌మ‌ణ‌?!

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మ‌రో కోలుకోలేని ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగ‌నుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడ‌డంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్‌ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపార‌ట‌. ఇందులో భాగంగానే ఎల్. రమణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్తు లేనందున‌.. ర‌మ‌ణ కూడా గులాబీ గూటికి చేరేందుకే సుముఖంగా ఉన్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇక ర‌మ‌ణ టీఆర్ఎస్‌లో చేరితే..ప్ర‌స్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిలో ఒకటి రమణకు ఇచ్చే అవకాశాలున్నాయి.

Share post:

Latest