షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌కు శ‌ర్వానంద్ గ్రీన్‌సిగ్నెల్‌..?!

June 16, 2021 at 10:17 am

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం ఈయ‌న అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మహా సముద్రం, కిశోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ హీరో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్ రెడ్డి త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్ట‌బోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్ నుంచి ఇప్ప‌టికే యంగ్ డైరెక్టర్స్ ఎంద‌రో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఇప్పుడు ఈ బ‌డా బ్యాన‌ర్ ద్వారానే దీపక్ రెడ్డి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఇటీవల దీపక్ చెప్పిన కథ నచ్చడంతో యూవీ క్రియేషన్స్ వారు సినిమా ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాతో శ‌ర్వానంద్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. శ‌ర్వానంద్‌కు కూడా దీప‌క్ కాథ బాగా న‌చ్చ‌డంతో.. వెంట‌నే ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ర్వ‌లోనే ఈ ప్రాజెక్ట్ వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌కు శ‌ర్వానంద్ గ్రీన్‌సిగ్నెల్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts