యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు.
అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాలో లెవల్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం హైదరాబాద్‌లో రీ స్టార్ట్ చేశారు. చాలా రోజుల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరిగి ఆర్ఆర్ఆర్ సెట్‌లో అడుగుపెట్టారు.
ఈ విషయాన్ని రామ్‌చరణ్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ కన్‌ఫర్మ్ చేశారు. లాక్‌డౌన్ 2.0ను ఎత్తివేసిన తర్వాత సినిమాల షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌కు హెయిర్ స్టైల్ చేయడం ద్వారా నా రోజు ప్రారంభమయ్యాయి. మనందరి ఫేవరేట్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు అని ట్వీట్ చేశాడు. అంతేకాదు, చరణ్‌తో దిగిన ఫొటో కూడా పోస్ట్ చేశాడు.
Today In Hyderabad, Lockdown 2.0 is lifted and the movies have resumed their shoots.. Starting my day with a Haircut for Superstar Ram Charan @AlwaysRamCharan for the Movie #RRR directed by everyone’s favourite @ssrajamouli Sir.@alwaysramcharan @AalimHakim pic.twitter.com/vYODyMNEFH
— Aalim Hakim (@AalimHakim) June 21, 2021