బాలయ్య బ‌ర్త్‌డే..వెల్లువెత్తుతున్న విషెస్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ 61 పుట్టిన రోజు నేడు. సినీ రంగంలోనూ, రాజ‌కీయ రంగంలోనూ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతున్న బాల‌య్య బ‌ర్త్‌డే అంటే నందమూరి అభిమానులకు ఓ పండగ లాంటిది. ప్రతి ఏడాది నందమూరి ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు.

అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా కోరాడు బాలయ్య. దీంతో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు అభిమానులు. మ‌రోవైపు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి బాల‌య్య‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాబాయ్ బాల‌య్య‌కు స్పెష‌ల్ విషెస్ తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయ‌గా.. ఆయ‌న ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఇక ఎన్టీఆర్‌తో పాటు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, గోపీచంద్ మాలినేని, శ్రీ‌కాంత్‌, సుధీర్ బాబు, నారా రోహిత్ ఇలా పలువురు ప్ర‌ముఖులు కూడా బాల‌య్య‌కు విషెస్ తెలిపారు.

https://twitter.com/naarabrahmani/status/1402818198961942530?s=20

 

Share post:

Latest