గెట్ రెడీ..`నార‌ప్ప‌` టీజ‌ర్‌కు ముహూర్తం ఫిక్స్‌?

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం నార‌ప్ప‌. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన అసురన్ కు రీమేక్‌. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే వారం చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. టీజ‌ర్ ద్వారా మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Share post:

Popular