‘లైగర్’ క్లైమాక్స్ పై న్యూ అప్ డేట్..?

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న లైగర్ మూవీ క్లైమాక్స్ పై ఒక క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తుంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాల పాటు ఎంతో ఎమోషనల్ గా ఉండనుందట. అత్యంత ఎమోషనల్ గా ఉండే ఈ క్లైమాక్స్ ఎన్నో ట్విస్ట్ లతో కూడి ఆడియన్స్ ను మరింత థ్రిల్ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రూమర్స్ వచ్చాయి.

ఈ సినిమాలో ఆత్యంత కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ యాక్ట్ చేయనున్నాడు.ఈ చిత్రాన్నిఅన్ని భాషల్లో ఒక్కసారే తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఈ సినిమా కోసం విజయ్ తన లుక్ ఇంకా హెయిర్ స్టైల్ అంతా మార్చేసి, మునుపెన్నడూ చూడని రీతిలో ఈ మూవీలో విజయ్ సరి కొత్త లుక్ తో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Share post:

Latest