కొరటాల‌కు షాకిచ్చిన చిరు..ఏం జ‌రిగిందంటే?

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య‌. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు ఇంకా ఇర‌వై రోజుల బ్యాలెన్స్ షూట్ మాత్ర‌మే ఉండ‌గా.. క‌రోనా సెకెండ్ వైవ్ రూపంలో విరుచుకుప‌డింది. దీంతో షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి కాస్త త‌గ్గింది. పాజిటివ్ కేసులు కూడా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో.. ఈ నెల‌లోనే బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసేయాల‌ని కొర‌టాల భావించార‌ట‌.

సెట్ లో పరిమిత సంఖ్యలో క్రూ మెంబర్స్ తో షూటింగ్ చేస్తే రిస్క్ ఉండదని కొరటాల అనుకున్నార‌ట‌. కానీ ఈ విషయంలో కొర‌టాల‌కు చిరంజీవి షాకిచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ నెలలో షూటింగ్ కు చిరు నో చెప్పాడు. మరో నెల రోజులు ఆగుదామని కొరటాలకు చెప్పాడట. దీంతో కొర‌టాల కాస్త నిరాశ‌కు గురైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest