‘జగమే తంత్రం’ ట్రైలర్ మీ కోసం..!

June 1, 2021 at 2:15 pm

కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం జగమే తంతిరమ్. హీరో ధనుష్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగులో జగమే తంత్రం పేరుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోవిడ్ కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు మూవీ మేకర్స్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ జూన్ 18న ఈ మూవీని ఒటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారు.

ఈ సందర్బంగా జగమే తంత్రం చిత్రం తమిళ ట్రైలర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ లో ధనుష్ తమిళనాడుకు చెందిన సురులి అనే ప్రమాదకరమైన గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారు. ఈ యాక్షన్ ప్యాకెడ్ మూవీ ట్రైలర్ వీక్షకులను ఎంతగానో అలరిస్తూ ఆసక్తిని నింపుతుంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ కార్తీక్ సుబ్బారాజు సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

‘జగమే తంత్రం’ ట్రైలర్ మీ కోసం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts