పుష్ప సినిమాలో తరుణ్.. ?

June 1, 2021 at 1:46 pm

ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎప్పుడూ కనిపించని వైవిధ్యమయిన పాత్ర చేస్తుండడంతో మూవీ ఇండస్ట్రీలో ఈ చిత్రానికి మంచి హైప్ నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు పొందిన హీరో తరుణ్ పుష్ప మూవీలో భాగం అవబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.

అసలు విషయం ఏంటంటే ఈ చిత్రంలో ప్రముఖ మళయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున సంగతి తెలిసిందే. ఈయన పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పడానికి హీరో తరుణ్ ని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ అవకాశం తరుణ్ కి ఎలా వచ్చిందంటే, మలయాళంలో పెద్ద విజయం పొందిన అనుకోని అతిధి మూవీని తెలుగులో డబ్ చేసి గత వారమే ఆహాలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పారు. తరుణ్ వాయిస్ ఫహాద్ ఫాజిల్ కి బాగా సెట్ అవ్వడంతో, పుష్ప మూవీకి కూడా తరుణ్ చేతనే డబ్బింగ్ చెప్పించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తరుణ్ పుష్ప చిత్రంలో భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది.

పుష్ప సినిమాలో తరుణ్.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts