హైపర్ ఆదిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?

June 14, 2021 at 4:51 pm

జబర్దస్త్ హైపర్ ఆది అంటే తెలియ‌ని వారుండ‌రు. అయితే ఆయ‌న‌పై ఇప్పుడు ఓ ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచ‌రాం. ఆదిపై ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు కంప్ల‌యింట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకు కార‌ణం.. ఈ నెల 13న ఈ టీవీలో ప‌బ్లిష్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీప్రోగ్రామ్‌లో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను ఆది కించ‌ప‌రిచారంటూ ఫిర్యాదు చేశారు.

అయితే ఆది తోపాటు స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌పై వారిపై కూడా జాగృతి స‌భ్యులు కంప్లయింట్ చేశారు. ఇందులో జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ తో పాటుగా సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కార్తీక్ ఇత‌ర నాయ‌కులు ఉన్నారు. అయితే ఆదిపై ఫిర్యాదులు రావ‌డం ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆదిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు అందిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. దీనిపై ఆది ఇంకా స్పందించ‌లేదు.

హైపర్ ఆదిపై ఫిర్యాదు.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts