రజినీ అర్యోగ్యంపై ఆందోళన..?

ర‌జినీ కాంత్ రీసెంట్‌గా కొంత అస్వ‌స్థ‌కు గురయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయన తీవ్ర మానసిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. మొన్న‌టి వ‌రకు అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొంది ర‌జనీకాంత్ త్వ‌ర‌లోనే అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రజినీ కాంత్ రీసెంట్‌గా తీవ్ర రక్తపోటుతో అనారోగ్యానికి గుర‌య్యారు. దాంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సూప‌ర్ స్టార్‌… ఇప్పుడు అమెరికా ప‌య‌న‌మ‌య్యారు.

ఇందుకు కేంద్ర‌ప్ర‌భ‌త్వం కూడా స్పెష‌ల్ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. ఆయ‌న వెళ్లేందుకు ఓ స్పెష‌ల్ ఫ్లైట్ణు ఏర్పాటు చేస్తున్నారు. ర‌జినీకి ఇప్ప‌టికే కిడ్నీ మార్పిడి జరిగిన విష‌యం తెలిసిందే. అయితే త‌ర‌చుగా ర‌జినీ త‌న హెల్త్ చెక‌ప‌ల్ ల కోసం అమెరికా వెళ్తుంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా అమెరికా వెళ్ల‌బోతున్నారు. అక్క‌డ వ‌ర‌ల్డ్ క్లాస్ డాక్ట‌ర్ల స‌మ‌క్షంలో ర‌జినీకి చెక‌ప్‌లు జ‌రుగుతాయి. దాని త‌ర్వాత ఆయ‌న కొంత కాలం అక్క‌డే ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్స్ ఉంది.