భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్నట్టుగానే నేడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియా సమావేశమైన ఈటల.. తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు.
ఇక టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని.. రాష్ట్రం కోసమే అవన్నీ భరించామని ఈటల అన్నారు. కేసీఆర్ ఉండే నివాసం ప్రగతి భవన్ కాదని… అదొక బానిసల నిలయమని ఈటల మండిపడ్డారు.
బానిస కంటే అధ్వానంగా ఉన్న మంత్రి పదవి తనకెందుకని ఈటల పేర్కొన్నారు. ఇక ఓటమి అనేది తెలియదు.. ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిచా.. అని ఈటల రాజేందర్ అన్నారు.

