ధ‌నుష్ `జగమే తంత్రం`కు బిగ్ షాక్‌..తొలి రోజే అలా..?

త‌మిళ స్టార్ హీరో ధునుష్ 40వ చిత్రం జగమే తంత్రం(త‌మిళంలో జగమే తందిరమ్). కార్తిక్‌ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా న‌టించ‌గా..జోజు జార్జ్,జేమ్స్ కాస్మో,కలైరాసన్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైంది. అయితే 190 దేశాల్లో.. 17 భాషల్లో ఏక కాలంలో విడుద‌లైన ఈ చిత్రానికి బిగ్ షాక్‌ త‌గిలింది. విడుదలైన తొలి రోజే ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

టెలిగ్రామ్, తమిళ్ రాకర్స్ సహా కొన్ని పైరసీ మూవీలు అప్‌లోడ్ చేసే వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. రిలీజైన కొద్ది సేపట్లోనే పైరసీ సైట్లు ఈ మూవీ కంటెంట్‌పై దాడి చేయడం పట్ల.. చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనకు గురవుతుంది.

Share post:

Latest