పుష్ప‌రాజ్ కోసం రంగంలోకి చిరు..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. పుష్ప‌రాజ్ కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగ‌బోతున్నాడ‌ట‌. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఆ స్పెషల్ సాంగ్‏లో చిరు ఇలా వచ్చి వెళ్లిపోతారని అంటున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే.. ఒకే ఫ్రేమ్‌లో బ‌న్నీ, చిరుల‌ను చూసి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు.

Share post:

Latest