కోలీవుడ్ హీరో సంచలన నిర్ణయం..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రెండేళ్ల కింద‌టి నుంచే ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యాడు. అంత‌కుముందు వ‌ర‌కు సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. నిర్మాత‌గా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో ఓకే ఓకే సినిమాతో హీరోగా మారాడు ఉదయనిధి స్టాలిన్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ తొమ్మిదేళ్లలో 13 సినిమాలు చేశాడు.

అందులో దాదాపు 7 సినిమాలు హిట్ అయ్యాయి. క‌రుణానిధి కూడా రాజ‌కీయాల్లోకి రాక‌ముందు సినిమాల‌కు ప‌నిచేశాడు. అప్ప‌ట్లో ఆయ‌న దాదాపు 75 సినిమాల‌కు క‌థ‌లు అందించాడు. తాత వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలు చేస్తున్నాడు ఉద‌య‌నిధి స్టాలిన్‌. అయితే ఇన్ని రోజులు ప‌రిస్థితి వేరు.. ఇప్పుడు ప‌రిస్థితి వేరు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వ‌చ్చి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం, త్వ‌ర‌లోనే మంత్రి కూడా కాబోతుండ‌టంతో ఇక‌పై సినిమాల‌కు స‌మ‌యం దొర‌క‌దు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share post:

Popular