మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌కు బంప‌ర్ ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో న‌టించే బంప‌ర్ ఛాన్స్‌ సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణను వ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌భాస్‌ అక్కగా రమ్యకృష్ణను తీసుకున్నట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, గ‌తంలో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లిలో ప్ర‌భాస్‌కు త‌ల్లిగా శివగామి పాత్రలో ర‌మ్య‌కృష్ణ ఏ విధంగా ఒదిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌భాస్‌, ర‌మ్య‌కృష్ణ ఒకే స్క్రీన్‌పై అల‌రించ‌నున్నారు.

Ramya Krishnan on Twitter: "Happy Birthday to one of my favourite co-star # Prabhas #HappyBirthdayPrabhas ?"

Share post:

Popular