గోల్డెన్ గాళ్‌గా బాలీవుడ్ బ్యూటీ..?

ప్రియాంక చోప్రా ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన అందాల భామ. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతోంది. హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం దొరకాలే కానీ ఈ భామ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా ప్రియాంక క్లీవేజ్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. ప్రియాంక చోప్రా గోల్డెన్ గాళ్ అవ‌తార‌మెత్తింది. లాస్ ఏంజెల్స్ లో ఆదివారం రాత్రి 2021 బిల్ బోర్డు మ్యూజిక్ అవార్డ్సు ఫంక్ష‌న్ లో పాప్ సింగ‌ర్, ప్రియాంక భ‌ర్త నిక్ జోన‌స్ త‌న సోద‌రులు కెవిన్‌, జోయ్‌, డీజే మార్ష్‌మెల్లోతో ఫ‌ర్ ఫార్మెన్స్ నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ లో గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక త‌నభ‌ర్త నిక్ తో క‌లిసి కెమెరాకు ఫోజులిచ్చింది. డోల్సే అండ్ గ‌బ్బ‌న డిజైన్ చేసిన స్పార్‌క్లింగ్ గోల్డెన్ గౌనులో బ‌ల్గ‌రీ అలంక‌ర‌ణ‌తో నిక్ ప‌క్క‌న నిల్చొని త‌ళుక్కున మెరిసింది ప్రియాంక‌. మ‌రోవైపు నిక్ గ్రీన్ ఫెండీ సూట్‌లో హ్యాండ్ స‌మ్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఈ ఇద్ద‌రు స్టార్ సెల‌బ్రిటీలు మైక్రోసాఫ్ట్ థియేట‌ర్ లో రెడ్ కార్పెట్ పై హొయ‌లు పోతూ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. బిల్ బోర్డు మ్యూజిక్ అవార్డ్స్‌ను స‌మ‌ర్పించ‌డం చాలా ఎక్జ‌యిటింగ్ గా ఉంద‌ని ఇన్‌స్టాగ్రామ్ లో క్యాప్ష‌న్ ఇచ్చింది.

Share post:

Popular