ఎన్టీఆర్ బ‌ర్త్‌డే.. నారా లోకేష్ స్పెష‌ల్ విషెస్‌!

స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. నేడు 38వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బాలనటుడిగా సినీ గడప తొక్కి నేడు తారక రాముడిగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తనను అభిమానించే వారి కోసం ముందుడే ఈయ‌న అందరి వాడుగా పేరు దక్కించుకున్నాడు.

ఇక నేడు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ పొలిటికల్ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ బావ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.

ఎన్టీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని లోకేస్ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం లోకేష్ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular