జబర్థస్త్ లోకి రీ ఎంట్రీకి సిద్ధంగా ఉన్న రోజా.. ?

నవ్వుల రాణి రోజా జబర్థస్త్, ఎక్సట్రా జబర్థస్త్ రెండు షోల్లో తిరిగి టీవీపై కనిపించనున్నారు. రాబోయే ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్ లో రోజా పాల్గొన్నారు. శస్త్రచికిత్స తరువాత విరామం తీసుకుంటున్న ఆమె మళ్లీ జబర్థస్త్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సమాచారం. తెలుగు బుల్లితెరపై జబర్థస్త్ షో తెచ్చుకున్నంత పేరు మరే ఇతర షోకు లేదనే చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ షో ఇప్పటికీ నవ్వులను పంచుతూనే ఉంది. ఈ మధ్య రోజా ఇటు నియోజకవర్గ కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు.

అటు ఏపీఐసీసీకి చెందిన వ్యవహారాలపైనే ఫోకస్ చేశారు. అధికారులతో ఆన్ లైన్ లో మీటింగ్ లు పెడుతూ సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో ఇక జబర్థస్త్ రీ ఎంట్రీకి ఇదే సరైన సమయం అని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో సైతం యాక్టివ్ గా ఉండే ఆమె ఎమ్మెల్యే కావడానికి ఈ జబర్దస్త్ కారణం అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాబట్టి నవ్వుల రోజా మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పై సందడి చేయనున్నారు.

Share post:

Latest