క‌రోనా దెబ్బ‌కు విమానంలోనే వివాహం..వీడియో వైర‌ల్‌!

May 24, 2021 at 8:24 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో ఈ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతుండ‌డంతో.. ప్ర‌జ‌లు అస్త‌వ్య‌స్త‌లు ప‌డుతున్నారు. ఇక మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ మాయ‌దారి వైర‌స్ పెళ్లిళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.

ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ‌గా.. కొంద‌రు మాత్రం ముహూర్తాలు ఉండ‌వేమోన‌ని మ‌మ అనిపించుకుంటున్నారు. తాజాగా మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకున్నారు. ఇంద‌లో వింతేం ఉంది అని అనుకోవ‌చ్చు. కానీ, వీరు నెల‌పై కాదు నింగిలో పెళ్లి చేసుకున్నారు. గాల్లో వెళుతున్న విమానంలోనే వ‌రుడు వ‌ధువుకు తాళి కట్టి పెద్దలందరి ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు.

నిజానికి రాకేష్, దక్షిణల పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. ఇందు కోసం ఇరు కుటుంబాల పెద్దలు బెంగళూరు నుంచి మదురైకి వచ్చే విమానంలో బయలు దేరారు. అయితే ఇంత‌లోనే క‌రోనా తీవ్రత దృష్ట్యా తమిళనాడు సర్కార్ మంగళవారం నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్న ఇరు కుటుంబాలు విమానంలోనే వివాహతంతు కానిచ్చేశాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

క‌రోనా దెబ్బ‌కు విమానంలోనే వివాహం..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts