తెలంగాణలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు..ఎప్ప‌టివ‌ర‌కంటే?

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. దాంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. తెలంగాణ‌లో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించ‌గా.. అప్ప‌టి నుంచి క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు కాస్త అదుపులోకి వ‌చ్చాయి.

- Advertisement -

దాంతో ఈ నెల 30 వ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో మ‌రోసారి లాక్‌డౌన్ పొడిగించ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లాక్‌డౌన్ సత్ఫలితాలనే ఇచ్చిందని, మరికొన్ని రోజులు పొడిగిస్తే కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్ర‌మంలోనే మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Share post:

Popular